04:57 AM, 16 Saturday January 2021

అండగా మేమున్నాం అధైర్యపడొద్దు

– గిరిజన మిత్ర కార్యక్రమం నిర్వహించిన ఎస్సై గుణశేఖర్
– వలస గిరిజనులకు భరోసా కల్పించి పిల్లలకు స్వీట్స్, పుస్తకాలు పంపిణీ

కూనవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వలస గిరిజనులకు అండగా ఉంటామని ఎస్సై గుణ శేఖర్ అన్నారు. గురువారం కూనవరం మండలం, పోలిపాక గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురంగిరిజన మిత్ర కార్యక్రమాన్ని పోలవరం ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గుణశేఖర్ మాట్లాడుతూ ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉంటే తమకు తెలియజేస్తే మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా వలస గిరిజనులకు నిత్యావసర సరుకులు, ఇంట్లో వాడుకునే చిన్న చిన్న సామాన్లు, పిల్లలకు ఆట బొమ్మలు, పలకలు, బలపాలు, తినుబండరాలు తదితర వస్తువులను సిబ్బంది తో కలిసి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కూనవరం పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#