04:07 AM, 2 Tuesday March 2021

అక్రమ మద్యం రవాణా, నాటు సారా తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు..

– ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ ఐ. ఆర్. దొరబాబు…

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నాటుసారా తరలిస్తున్న ఒక వ్యక్తిని, అక్రమ మద్యం సీసాలు కలిగిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ ఐ. ఆర్. దొరబాబు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ ఎస్పీ ఆదేశానుసారం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా, అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన తాడి చిన్న వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుండి నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన చెల్లె వీర్రాజును రాయవరం పోలమ్మ  పుట్ట వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తీ అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకునివారిపైన కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా,  రిమాండ్ విధించినట్లు ఎస్సై దొరబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#