05:13 PM, 3 Wednesday March 2021

అట్టహాసంగా ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బొర్రా.అలివేలు నామినేషన్ దాఖలు

– అభ్యర్థిని బలపర్చిన టిడిపి నాయకులు ఏపూరి.వెంకటేశ్వరరావు
– ఇండిపెండెంట్ రెండో అభ్యర్థిగా బొర్రా.కమల నామినేషన్ దాఖలు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండవ రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎటపాక మండలంలోని రాయనపేట గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా.అలివేలు ఆదివారం చోడవరం గ్రామపంచాయతీలోని ఎర్రగుంట ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మండల టిడిపి నాయకులు ఏపూరి.వెంకటేశ్వరరావు బలపరచగా సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా.అలివేలు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. టిడిపి పార్టీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు సర్పంచ్ అభ్యర్థి బొర్రా.అలివేలు పేర్కొన్నారు. అయితే టిడిపి పార్టీ తరుపున దుద్దుకూరి.నవీన్ బలపర్చగా రెండవ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా బొర్రా.కమల కూడా ఆర్వోకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాయనపేట గ్రామపంచాయతీలోని మొత్తం 10 వార్డులకు గానూ 9 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్లకు ముందుగా రాయనపేట నుండి చోడవరంలోని నామినేషన్ కేంద్రానికి అట్టహాసంగా బైక్ ర్యాలీగా సుమారు 300 మంది ప్రజానీకంతో అభ్యర్థులు చేరుకోని నామినేషన్ పత్రాలను అందజేశారు. మండల పరిధిలోని 5 జోన్లలో నామినేషన్ల ప్రక్రియలో రెండవ రోజు సైతం పెద్దఎత్తున అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేశారు. నామినేషన్ల ప్రక్రియకు సోమవారం ముగింపు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ నాయకులు పూనెం.గోపాల్ , సోయం.రామారావు , బొర్రా.రాంబాబు , బొర్రా.రాము , గోలి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#