02:16 AM, 3 Wednesday March 2021

అట్టహాసంగా సూరంపాలెం బాలు నామినేషన్ కార్యక్రమం

– వందలాదిగా తరలివచ్చిన జనసేన అభిమానులు కార్యకర్తలు..

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూరంపాలెం బాలు,  శివ అనే వీరిద్దరూ వార్డు నెంబర్ లు గా బీసీ వర్గానికి చెందిన గుత్తుల గంగాధరం సర్పంచి అభ్యర్థిగా ఆదివారం పంచాయతీ కార్యాలయంలో  ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో  జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరం పాలెం గ్రామంలో డీజే తీన్మార్ తో జనసేన పార్టీ కండువా మెడలో వేసుకుని బాలు, శివ ఇదరు వందలాదిమంది అభిమానులతో పురవీధుల గుండా తిరుగుతూ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సూరం పాలెం గ్రామం నుంచి జనసేన పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బీసీ వర్గానికి రావడంతో గుత్తుల గంగాధర్ ను సూరంపాలెం సర్పంచి అభ్యర్థిగా నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న 12 వార్డులో  12 మందిని నెంబర్లు గా పోటీలో నిలబెట్టడం జరిగిందని తను సూరం పాలెం గ్రామం 4 వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే రెండవ వార్డు నుంచి నల్లల శివ సత్య గంగాధర్  పోటీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామానికి సేవ చేసే అదృష్టాన్ని తమకు కల్పించాలని వారు కోరారు..

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#