12:00 PM, 2 Tuesday March 2021

అభివృద్ధి కి ఓటెయ్యండి…

– వైస్సార్ సిపి కి పట్టం కట్టండి…
– రాజీవ్ గృహ కల్ప లో ప్రచారం..

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకు వెళుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా వైకాపా అభ్యర్థులను గెలిపించాలని మండపేట పురపాలక సంఘ 30 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.మండపేట 30 వ వార్డు పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి వై ఎస్ ఆర్ సి పి కి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కాలనీలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మండపేట నియోజకవర్గ వై ఎస్ ఆర్ సి పి ఇన్ చార్జ్  తోట త్రిమూర్తులు నాయకత్వంలో కాలనీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
షేక్ కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా, వైస్సార్ సిపి నాయకులు చిట్టం శెట్టి సత్యనారాయణ, రుద్రాక్షల సాయిబాబు, సుంకర శ్రీను, రాయుడు శ్రీను, చిక్కం వీరవెంకట సత్యనారాయణ (కొండ), గుత్తుల వాసు, షేక్ ఆరిఫ్ (చోటా), గుండవరపు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#