02:13 AM, 20 Wednesday January 2021

అమ్మవారికి ఘనంగా విశిష్ట పూజలు

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసియున్న శ్రీబాలా త్రిపుర సుందరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి పర్వదినోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారికి సువర్ణ, రజిత సహస్ర పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ మాట్లాడుతూ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పౌర్ణమి పర్వ దినం సందర్భంగా బంగారం, వెండి పుష్పాలతో సహస్రపుష్పార్చన, బాల హోమం నిర్వహించి, విశిష్ట పూజలు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#