05:55 PM, 28 Thursday January 2021

అమ్మ ఒడి పథకం రాష్ట్రంలో చిన్నారులకు ఓ వరం లాంటిది

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రంలోని చిన్నారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు దేవుడిచ్చిన మేనమామగా సీఎం.జగన్ నవరత్నాలలో ఒకటిగా గత ఏడాది ప్రవేశపెట్టిన అమ్మ ఒడి చిన్నారులకు ఒక వరం లాంటిదని వైకాపా జిల్లా నాయకులు కురినాల.వెంకట్ (బుజ్జి) పేర్కొన్నారు. ఈ పథకంతో లక్షలాది పేద విద్యార్థుల కుటుంబాలకు ఆసరా లభిస్తోందన్నారు. రెండో ఏడాది సైతం అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నగదు 15 వేల రూపాయలు చిన్నారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం జమ కాబడ్డాయి. దీంతో పేద చిన్నారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని నాయకులు కురినాల.వెంకట్ (బుజ్జి) పేర్కొన్నారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని , ప్రతి ఒక్కరూ ఆయా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని వైకాపా జిల్లా నాయకులు కురినాల.వెంకట్ (బుజ్జి) పేర్కొన్నారు. ఎటపాక మండల కేంద్రంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలందరికీ అన్ని విధాలుగా సహాయపడాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారని , ఏ ఆసరా లేని వృద్దులకు , వితంతువులు , వికలాంగులకు , దీర్ఘకాలిక రోగులకు వైకాపా ప్రభుత్వం అండగా నిలిచి ఉంటుందని , మహిళలందరిని తోబుట్టువులుగా భావించి వారి పిల్లల భవిష్యత్ కోసం సహాయపడాలనే ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ.15 వేలు ముఖ్యమంత్రి జగన్ సహాయం చేశారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎన్నో ఆటుపోట్లు మధ్య పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తూ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు. ఇది ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తోటి నాయకులు , కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఏజెన్సీలో వైకాపా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఇటీవల వివిధ పథకాలను పొందిన లబ్ధిదారులు వైకాపా ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి , ఎమ్మెల్యే ధనలక్ష్మి , జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (బాబు)కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#