10:16 AM, 16 Saturday January 2021

అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం ఈనెల 11న

గుడివాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గుడివాడ , జనవరి 8 : కులం , మతం , ప్రాంతాలకు అతీతంగా , పారదర్శకంగా అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల ఎంపిక జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారిణి కమలకుమారి , గుడివాడ , గుడ్లవల్లేరు మండలాల ఎంఈవో భవిరి శంకర్‌నాథ్ తదితరులు కలిశారు . ఈ సందర్భంగా అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల వివరాలను మంత్రి కొడాలి నానికి వివరించారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీన అమ్మ ఒడి రెండవ విడత ఆర్ధికసాయాన్ని తల్లుల ఖాతాలకు సీఎం జగన్మోహనరెడ్డి జమ చేయనున్నారని చెప్పారు . చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు . 1 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు ఈ పథకం కింద ఏటా రూ .15 వేల ఆర్ధికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు . ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు , కళాశాలలు , ఎయిడెడ్ , అస్ఎయిడెడ్ , ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు . జగనన్న అమ్మ ఒడి పథకం కింద మొదటి విడతలో 43 లక్షల 54 వేల 600 మంది లబ్ధిదారులకు రూ . 6 వేల 336 కోట్ల సాయాన్ని అందజేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#