01:24 AM, 24 Sunday January 2021

అర్హత ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు సీయం జగన్ లక్ష్యం

– మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిరుపేదలకు గూడు ఉండలనే లక్ష్యంతో సుమారు 27 వేల కోట్ల రూపాయలతో పేదలందరికీ ఇల్లు ఇచ్చే గణత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మడలం లోని చెల్లూరు,వెంటూరు, కురకాళపల్లి గ్రామాలలో మంగళవారం పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ నేపద్యంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ  క్రొత్తగా పెళ్లి అయిన దంపతులు అదే రోజు దరఖాస్తు చేసుకుంటే అర్హత నన్ను చూసి పది రోజుల్లోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు మహిళల ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రి  వై. యస్. జగన్మోహన్ రెడ్డి ముప్పై  లక్షల యాభై నాలుగు వేల మంది ఇళ్లులేని  పేదలకు సుమారు  తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం  అమలు చేస్తున్నామని  అన్నారు .ఇళ్ళ స్థలాల పంపిణీ లో పేదరికమే అర్హతగా చూశామనీ  కులం,మతం,పార్టీలకు అతీతంగా నిక్షపక్తపాతంగా, పూర్తి పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నామనీ తోట అన్నారు.  గతంలో ఇంటి స్థలం కోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షణలు చేసినా అందని పట్టా ఇప్పుడు అధికారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ ఇస్తున్నారని అన్నారు. ఇంటిపట్టా తీసుకుని ఇంటి స్థలం  స్వయంగా చూసుకుంటున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం అంతాఇంతా కాదనీ  ఎంతో భావోద్వేగాలకు గురై ఆనందభాష్పాలు రాలుస్తున్నారన్నారు.ఇతర పార్టీలకు చెందినవారు కూడా పట్టాలు పొంది  ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారనీ ఇధి ఒక్క జగనన్నకే సాధ్యమని చెప్పారు. ప్రతీ లబ్ధిదారునికి  ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన శాంక్షన్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా ఇళ్లు పూర్తయ్యే నాటికి రోడ్లు, డ్రైన్స్, విద్యుత్ వంటి నివాసానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించి కాలనీలు అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఒక్కటే అర్హులైన ప్రతి పేదవారికీ ఇల్లు ఇవ్వాలి కుటుంబంతో హాయిగా జీవించాలి ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసు ఉన్న వ్యక్తి  మన ముఖ్యమంత్రి అని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
మండపేట నియోజవర్గ ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరు మంచి చేసినా మంచిగానే చూడాలని ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం  చెల్లూరు వెంటూరు కూర్మాపురం గ్రామాలలో  సుమారు 1086 ఇళ్ల స్థలాలు పలు గ్రామాలలో వున్న  నివేశ స్థలం లబ్ధిదారులకు తోట చేతులమీదుగా అందించారు. అనంతరం కొంత మంది లబ్ధిదారులకు స్థలాల్లో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కర్రి పాప రాయుడు, రాష్ట్ర నాయకులు రెడ్డి రాధాకృష్ణ, మండపేట ఏ ఏం సి చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త చైతన్య రాజు బాబు, రాయవరం వైకాపా నాయకులు తేతలి సుబ్బిరామిరెడ్డి, సొసైటీ అధ్యక్షురాలు నల్లమిల్లి మంగతాయారు, నల్లమిల్లి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సిపి గ్రామ శాఖ అధ్యక్షులు, చింతా సుబ్బా రెడ్డి, మళ్ళి డి సూరా రెడ్డి, చోడే  వెంకటరమణ, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పాలికి గోవిందు, పలివేల రామకృష్ణ, చిక్కాల శ్రీ రాములు, పిల్లి పరసు రామ్, కోటి అంబేద్కర్, కందర్పా హనుమాన్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#