10:45 PM, 3 Wednesday March 2021

ఆటోలకి పార్టీ జెండాలు ఉండొద్దు.

– స్థానిక యస్ ఐ లు చంటి వెంకటేష్
– ఆటోలకు పర్మిషన్ తప్పని సరి అని ఆటో కార్మికులకు అవగాహన
– ఎలక్షన్ కోడ్ ఉంది జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలి.
– జీడిగుప్ప, రేఖపల్లి పలు ప్రాంతాల్లో ప్రజలను ఎలక్షన్ పై అవగాహన కల్పించిన పోలిసులు.

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

స్థానిక ఎన్నికలు వచ్చే నెలలో జరగ నున్నాయి కాబట్టి ప్రతి ఆటో కార్మికుడు పోలీస్ వారు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొన్ని నిబంధనలకు అనుసరించి ఉండాలని స్థానిక యస్ ఐ లు చంటి, వెంకటేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  మండల పరిధిలోని జీడిగుప్ప గ్రామ పంచాయితిలో ఆ గ్రామ పంచాయితీ ప్రజలతో మాట్లాడారు. అనంతరం రేఖపల్లి జనక్షన్లో ఆటో కార్మికులతో మాట్లాడుతూ  ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మండలంలో ఎన్నికల కోడ్ ఉన్నందున స్థానిక ప్రజలతో పాటు, ఆటో కార్మికులు నిబంధనలను ఉల్లంగించ కుండా పోలీస్ వారి నిబంధనాలకు పాటించాలని కోరారు.  నాయకులు ఎవరైనా మీ ఆటో ప్రచారం కొరకు అడిగినప్పుడు పోలీస్ వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారో లేదో అడిగి తెలుసు కోవాలని, ఉదయం నుండి సాయంత్రం కూడా  సమయ పాలన పాటించాలని కోరారు.  యలక్షన్ కోడ్ ఉండగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, మద్యం మొయ్యడం, రవాణా చెయ్యడం, ఎటు వంటి బిల్లులు లేకుండా కొత్త వస్తువులు రవాణా చెయ్యడం లాంటివి చేస్తే పోలీస్ వారు తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.
ప్రలోబాలకు ఓటర్లనులోను చెయ్యొద్దు
ఆటోలలో మందు లాంటివి తీసుకెళ్లొద్దు. ఎటువంటి చట్ట వ్యతిరేక పనులకు ఎవరైనా పాల్పడితే వాటికి  సంబంధించి విషయాలు పోలీస్ దృష్టికి తీసుకు రావాలని , సమాచారం అందించాలని అన్నారు. ఎలక్షన్ సమయంలో ఒక్క సారి కేసు నమోదు అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  ఏ పార్టీ రాజకీయ నాయకులు వచ్చి కాపాడుతారనే ఆలోచనలు మీ మనస్సు నుండి తీసేయ్యలని సూచించారు. అనవసర విషయాల్లో తల ధూర్చొద్దని హెచ్చరించారు. కొంత మంది వ్యక్తులను ప్రలోభాలు పెట్టి  వస్తువులు లాంటివి అటోలలో దాటిస్తూ పోలీసులకు గట్ల దొరికితే చర్యలు తప్పవని అన్నారు  ఓటర్లను తీసుకెళ్లేటప్పుడు పలాన పార్టీకి ఓటు వేయమని ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఆటో కార్మికులంతా ఎన్నికల సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండి, పోలీస్ వారికి  మండలంలో ఏమి  జరుగుతుందో  తెలియ పర్చాలని ఈ సంధర్బంగా తెలియ జేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#