ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండల పరిధిలోగల 18 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు ఆరు కేంద్రాలు ఖరారైనట్లు ఎంపీడీవో ఝాన్సీ శనివారంనాడు తెలిపారు 18 గ్రామాలకు గాను మడికి, చొప్పెల్ల, నర్సిపూడి, ఆలమూరు, పెద్దపళ్ళ, చింతలూరు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలుగా ఉన్నాయి. మడికి గ్రామంలో మడికి, చెముడులంక , బడుగు వాణిలంక, చొప్పెల్ల గ్రామంలో చొప్పెల్ల, మూలస్థానం అగ్రహారం, నవాబుపేట, నర్సిపూడి గ్రామంలో నర్సిపూడి, గుమ్మిలేరు, మోదుకూరు, ఆలమూరు గ్రామంలో ఆలమూరు, జొన్నాడ, పెనికేరు, పెద్దపళ్ళ గ్రామంలో పెద్దపళ్ళ,కలవచర్ల పినపళ్ళ, చింతలూరు గ్రామంలో చింతలూరు, సందిపూడి, సూర్యరావుపేట, వీటికి సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లను అందజేయాలని ఆమె తెలిపారు.