05:41 PM, 6 Saturday March 2021

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు సత్వర సేవలు

– ప్రభుత్వాసుపత్రులలో శస్త్ర చికిత్సలకు ప్రాధన్యత
– ఆరోగ్యశ్రీ సేవలు పర్యవేక్షించడానికి టోల్ ఫ్రీ నంబర్ 0884-2358666
– జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు సత్వరం వైద్య సేవలు అందే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ను సన్నద్ధం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్యాధికారులతో జాయింట్ కలెక్టర్ ఆరోగ్యశ్రీ పధకం సమగ్ర నిర్వహణ పై కలెక్టరేట్ లో ఆమె కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పధకానికి ఎనలేని ప్రాధన్యత ఇస్తుందనీ, వీటి ఫలితాలు నూటికి నూరు శాతం అందే విధంగా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో వున్న వివిధ ప్రభుత్వ హస్పటలలో శస్త్ర చికిత్స కేంద్రాలను మెరుగు పర్చవలసివుందన్నారు. ఈ కేంద్రాలకు కావలసిన మౌళిక సదుపాయాలు మెరుగు పర్చడానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకమైనది తమ వద్దకు వచ్చే రోగులకు వారికి కావలసిన సమాచారం అందించే విధంగా వుండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో అవుట్ పేషెంట్(ఓపి), ఇన్ పేషెంట్ (ఐపి) వివరాలు సమగ్రంగా నమోదు కావాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలు పొందిన వారి వివరాలను సేకరించి వారి ఫోన్ నంబర్లకు తాము చికిత్స సమయంలో అందిన వైద్యం సంతృప్తికరంగా వున్నదీ, లేనిది సేకరించాలన్నారు. ఆరోగ్య శ్రీ పధకం అమలు పై సత్వర సమాచారం కోసం 0884-2358666 పనిచేస్తుందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటలకు ఈ నెంబరుకు సంప్రదించవచ్చున్నారు. ప్రభుత్వ శెలవు దినాలలో వీరి సేవలు వుండవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలకు వచ్చే సమయంలో డాక్టర్లు సూచనలతో తీయించవలసిన ఎక్స్ రే, స్కానింగ్ లాంటి పరీక్షలను మరింత ఎక్కవ సేవలు అందించే విధంగా మెడికల్ డాక్టర్లకు లేబరేటరీలలో శిక్షణ ఇచ్చే విధంగా ప్రతిపాదనలు చేస్తున్నట్లు జేసి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే పేదవారికి నిబందనలు ప్రకారం వైద్య సేవలు అందించాలనీ అతి క్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జేసి కీర్తి చేకూరి తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.రమేష్ కిశోర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఎన్ . ప్రసన్నకుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా కో – ఆర్డినేటర్ రాధకృష్ణ, రిటైర్డ్ డిఎమ్లండ్ హెచ్ ఓ చక్రవర్తి లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#