04:06 AM, 2 Tuesday March 2021

ఆరోగ్యశ్రీ పథకంలో పేషెంట్ల నుంచి నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూల్ చెయ్యవద్దు

– జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆరోగ్యశ్రీ పధకంలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్ల నుండి నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరలు వస్తూలు చేస్తే అలాంటి ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్.రాధకృష్ణతో కలిసి కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి, సేఫ్ హస్పటలను తనిఖీ చేశారు. సేఫ్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ పధకం ద్వారా చికిత్స పొందుతున్న పేషేంట్ లతో జేసి ముఖాముఖీ మాట్లడారు. ఆరోగ్య ఆసరా అందుతుంది లేనిది అడిగి తెలుసుకొన్నారు. అదే విధంగా ఆసుపత్రిలో నిర్దేశించిన ధరలకే చికిత్స అందిస్తున్నది తెలుసుకోవడంతో పాటు అధికంగా ఏమైన మొత్తం అడుగుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకొన్నారు. ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్య సేవలు పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలనీ ఆసుపత్రి యాజమానులకు జేసి సూచించారు. అదే విధంగా ఆసుపత్రిలో చక్కటి పారిశుద్ధ్యంతో పాటు మౌళిక సదుపాయాలు సజావుగా నిర్వహించాలన్నారు. కాకినాడ సామాన్య ఆసుపత్రిలో కేన్సర్ వార్డును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. భోజనం సజావుగా అందుతుందని లేనిది వారిని అడిగి తెలుసుకొన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని రోగులకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అక్కడ వున్న ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని పరిశీలించి ఆరోగ్య మిత్రలు చేస్తున్న డేటా ఎంట్రీ లను పరిశీలించారు. వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య మిత్రలు సంయమనంతో పనిచేయాలనీ జేసి కీర్తి చేకూరి పలుసూచనలు చేశారు. ఈ పరిశీలనో జీజీ హెచ్ నూతన సూపరిటెండెంట్ ఆర్.మహాలక్ష్మీ, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ నవీన్, ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#