02:39 AM, 24 Sunday January 2021

ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పై నేషనల్ వెబినార్

– వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ హూమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ “ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మథ్మెటికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్” అనే అంశంపై ఈ నెల 6,7 తేదిలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు రెండు రోజుల నేషనల్ వెబినార్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షులుగా ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, కన్వీనర్ గా డా.జి.వెంకటరావు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధాన వక్తలుగా ఆచార్య టీవీఎస్.శేఖర్ హెడ్, స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్, ఐఐటి భువనేశ్వర్, డాక్టర్ కుర్మయ్య తమ్మినానా గణితశాస్త్ర అసోసియేట్ ప్రోఫిసర్ ఎన్.ఐ.టి తాడేపల్లిగూడెం, ఆచార్య మధుజైన్ స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్, ఐఐటి రూర్కే, డాక్టర్ నితు కమారి అసోసియేట్ ప్రోఫిసర్  స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ ఐఐటి మండి హాజరై అమూల్యమైన సందేశాలను అందిస్తారని చెప్పారు. యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా ఫ్రీగా రిజిస్టేషన్ చేయించుకొని విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొనవచ్చునని అన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనిన అభ్యర్థులకు ఈ సర్టిఫికెట్టును అందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, కోర్సు కోఆర్డినేటర్ ఎం.బాలకృష్ణ మరియు విభాగాధ్యాపకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#