10:05 AM, 16 Saturday January 2021

ఇంజనీరింగ్ లో స్కిల్ కోర్సులు

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ లో ఫ్యూచర్ స్కిల్ ఫ్రెమ్ వారు రూపొందించిన స్కిల్ కోర్సులు ఉంటాయని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలియజేసారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, నస్కోమ్(NASSCOM), ఫ్యూచర్ స్కిల్ ఫ్రెమ్ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ కోర్సులపై ఆన్ లైన్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి మరియు అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ దీనిలో హాజరయ్యారు. ఫ్యూచర్ స్కిల్ ఫ్రెమ్ వారు రూపొందించిన స్కిల్ కోర్సులు ఈ విద్య సంవత్సరం నుండి ఇంజనీరింగ్ లో పొందుపరుస్తామన్నారు. నూతన స్కిల్ కోర్సుల విధివిధాలను గురించి స్కిల్ సంస్థల అధికారులు సి.సంధ్య, వెంకట్ లు తెలియజేసారు. ఈ సందర్భంగా నన్నయ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ స్కిల్ కోర్సులను ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా అందుబాటులోనికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్.టేకి, డా.వి.పెర్సిస్, డా.కె.రమణేశ్వరి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#