10:17 AM, 16 Saturday January 2021

ఇంద్ర పాలెం లో పడకేసిన పారిశుధ్యం

– స్థానిక పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం
– డిపిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన స్థానికులు

కాకినాడ రూరల్, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లకాలువ రోడ్ నాలుగురోడ్లు జుంక్షన్ దగ్గర డ్రైనేజీ వద్ద కల్వర్టు లేక చెత్త అంత పేరుకుపోయిందని పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జిల్లా పంచాయతీ అధికారి కి శుక్రవారం స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ విగ్నేశ్వర నగర్ గొల్లపేట కు చెందిన చెత్త ట్రాక్టర్ 15 రోజులకు ఒకసారి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. త్రినాథరావు కిరాణా వ్యాపారి గొల్లపేట వెళ్లేదారిలో ఉన్న చెత్తను తొలగించడం లేదని కుళ్ళు వాసనతో డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధులు వ్యాపించవచ్చునని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పారిశుధ్యం పై దృష్టి సారించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#