మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట మండలం లో నామినేషన్లు ఉపసంహరణ తొలిరోజు శనివారం రెండు గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు.
ఆర్తమురు సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన గోలుగురి విజయభాస్కర్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈయన సతీమణి గోలుగురి అన్నపూర్ణ ఇక్కడ వైస్సార్ సిపి మద్దతు తో సర్పంచ్ గా పోటీలో వున్నారు. వెలగతోడు సర్పంచ్ కు నామినేషన్ వేసిన కోటిపల్లి రామారావు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 8 సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారి ఐదం రాజు తెలిపారు. అలాగే వార్డులకు సంబంధించి ఆర్తమురు లో ఐదుగురు, ద్వారపూడి లో ఒకరు ఉపసంహరించుకున్నారు. కేశవరం నుండి ముగ్గురు, వెలగతోడు లో ఇద్దరు ఏడిద లో 11 వార్డుల అభ్యర్థులు ఉపసంహరణ చేసుకున్నారు.