01:46 AM, 24 Sunday January 2021

ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.

– తహశీల్ధార్ యన్. శ్రీధర్
– తహశీల్ధార్ శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి
– ఇళ్ల స్థలాల పంపిణీ వేదికగా తెల్లవారిగూడెం
– నేడు డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, ఎమ్యెల్యే ధనలక్ష్మి చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం.
– నాలుగు గ్రామాల్లోని 1047 మంది లబ్ధిదారులు ఎంపిక
– తెల్లవారిగూడెం లో ఏర్పాట్లలో పాల్గొన్న మండల వైసిపి నాయకులు.

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలు –  పేదలందరికి ఇళ్లు అనే కార్యక్రమాలు వి యస్ అర్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో జగనన్న ఇస్తున్న ఇంటి స్థలముల పట్టా కార్యక్రమం నేడు మండలంలోని తెల్లవారిగూడెం గ్రామం వేదిక కానున్నది. ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో  నాలుగు గ్రామాల లబ్ధిదారులను ఎంపిక చేసి వారిని సుమారు 1047 మందిని గుర్తించడం  జరిగింది. నేడు రంపచోడవరం ఎమ్యెల్యే నాగుల పల్లి ధన లక్ష్మీ, డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు చేతుల మీదగా ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం జరగనున్నది.  జగన్ మోహన్ రెడ్డి గారు అణా విధంగా కులం , మతం,  వర్గం, పార్టీలకు అతీతంగా  హర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలపీఎంపిని కార్యక్రమం, పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు మనఫల వైసిపి నాయకులు తెలిపారు.
పట్టాల పంపిణీ వేదికగా తెల్లవారిగూడెం.
మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలకు ఇళ్ల పట్టాల ప.పిని కార్యక్రమం నేడు తెల్లవారిగూడెం గ్రామంలో నేడు డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, ఎమ్యెల్యే ధనలక్ష్మి  చేతుల మీదగా  పంపిణీ కార్యక్రమం జరగనున్నదని మండల వైసిపి నాయకులు తెలిపారు.  మండల తహశీల్ధార్ యన్. శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  తహశీల్ధార్ తో మాట్లాడి ఏర్పాట్లు గురించి తెలుసుకున్నామని అన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారు చేయడం జరిగిందని, వారి సర్వేనెంబర్లు, భూమి తీసుకునే లబ్ధిదారుల వివరాలు క్షుణ్ణంగా అధికారుల వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తహశీల్ధార్ శ్రీధర్ ని మీడియా వివరణ కోరగా అంత సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెల్లవారిగూడెం గ్రామంలోని స్కూల్ ఆవరణలో స్టేజి ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని,అందుకు రెవిన్యూ సిబ్బంది ఆ గ్రామాన్ని పరిశీలించి లబ్ధిదారుల పూర్తి వివరాలు సిద్ధ పరిచినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  తహశీల్ధార్ శ్రీధర్ తో పాటు తమ సిబ్బంది విఆర్ ఓ లు జోగారావు, దినేష్ మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#