10:06 AM, 16 Saturday January 2021

ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో చరిత్ర సృష్టించింన జగన్ ప్రభుత్వం

– వచ్చే మూడేళ్లలో ఒక్కరు కూడా ఇల్లు లేని వారు ఉండరు.
– ఎమ్మెల్యే చిర్ల

కొత్తపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల నివేశస్థలాలు పంపిణీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో చరిత్ర సృష్టించారని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట  గ్రామంలో  లబ్ధిదారులకు ఎమ్మెల్యే నివేశన పట్టాలను అందజేశారు.
కొత్తపేట మండలం బిళ్ళకుర్రు, పెదగూళ్లపాలెం గ్రామాలలో ఈరోజు శాసనసభ్యులు మరియు పి యు సి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి 1154 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ దేశంలో గాని, రాష్ట్రంలో గాని గతంలో ఎన్నడూ ఇలాంటి గొప్ప కార్యక్రమం జరగలేదని నివేశన స్థలాల కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్ప యజ్ఞంలా తీసుకుని పనిచేస్తున్నారని అన్నారు. నివేశన స్థలాల పంపిణీ తోపాటు ఒక్క రూపాయికే పక్కా గృహం  నిర్మించడం చారిత్రాత్మక మన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఇల్లులేని వారు ఉండకుండా చూడాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.
 ప్రజల అవసరాలు తీర్చగలిగే శక్తి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని, ప్రజల ఆశీస్సులతో ఆయన మరింత ఉత్సాహంతో పని చేస్తారని అన్నారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు కల్పించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యంతో చారిత్రాత్మక ఘట్టానికి తెర లేపారన్నారు. ఒకేసారి ఇన్ని లక్షల స్థలాలు పంపిణీ చేయడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడే పనులకు మద్దతు  పలకాలన్నారు.
వై.యస్.జగన్మోహన్ రెడ్డి  అర్హులైన ప్రతీ పేదవారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పేదలందరికీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#