03:01 AM, 24 Sunday January 2021

ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

– వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసుపులేటి పిలుపు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వైకాపా అధినేత , రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎటపాక మండలంలోని కృష్ణవరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో  6వ తేది బుధవారంనాడు పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం వుంటుందని వైకాపా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసుపులేటి.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (బాబు) మరియు ఎమ్మెల్యే నాగులపల్లి.ధనలక్ష్మి పాల్గొని వారిరువురు చేతుల మీదుగా పేదప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తారని నాయకులు పసుపులేటి.లక్ష్మణ్ పేర్కొన్నారు. కావున మండల వైకాపా శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని , పార్టీ శ్రేణులకు , మండల ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు. గిరిజన , బడుగు , బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైకాపా అభిమానులు , కార్యకర్తలు , మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కృష్ణవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో జరగబోవు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను స్థానిక తహశీల్దార్ సి.హెచ్.వెంకటేశ్వర్లు నేతృత్వంలో మండల రెవెన్యూ , హౌజింగ్ అధికారులు మరియు నాయకులు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గోసు.ప్రశాంత్ (చింటూ) , హౌజింగ్ ఏఈ శ్రీనివాసరావు , ఆర్.ఐ రాంబాబు , విఆర్వోలు వీరమ్మ , సావిత్రి , యూత్ నాయకులు దాసరి నరేష్ , మాలోత్ గోపి , చిచ్చడి.సూరిబాబు , సున్నం శ్రీను , కామయ్య , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#