02:03 AM, 24 Sunday January 2021

ఇసుక తవ్వకాల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

– జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఇసుక తవ్వకాల్లో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు వుంటాయని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నుండి పంచాయితీ రాజ్, రూరల్ డవలఫ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జిల్లా జాయింట్ కలెక్టర్లలతో ఇసుక మైనింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశమందిరం నుండి జేసి లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇసుక తవ్వకాల్లో జిల్లాలో అనుసరిస్తున్న విధానాన్ని ప్రిన్సిపల్ సెక్రటరికు జేసి వివరించారు. ప్రభుత్వలక్ష్యాలకు అనుగుణం సెమీ మెకనైజ్డ్ మిషన్లతో ఇసుకను తీసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సాండ్ మెనింగ్ పై నిరంతరం పర్యవేక్షణ వుందనీ, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని జేసి స్పష్టంచేశారు. ఓ పెన్ రీచ్ లో ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలు చేయాలని జేసి లక్ష్మీశ తెలిపారు. జొన్నాడ ఇసుక రీచ్ ల నుండి విశాఖపట్నానికి ఇసుకను రవాణా చేస్తున్నట్లు జేసి వివరించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#