10:21 PM, 1 Monday March 2021

ఉదయం 6.30 నుండి పోలింగ్

– పోలింగు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు
– మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగు ఉదయం 6.30 గంటల నుండి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా పోలింగు సమయాన్ని పెంచినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసారని కలెక్టర్ వివరించారు. పోలింగు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగు మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు దశల వారీగా ఈ నెల 9, 13, 17, 21 తేదీల్లో జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.

గ్రామ పంచాయతీ పోలింగు ప్రక్రియ పూర్తి కావడానికి 44 గంటల ముందుగా మద్యం దుకాణాలను మూసివేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. పోలింగు జరుగుతున్న ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల పోలింగు రోజున స్ధానిక సెలవులు ప్రకటించడం జరిగిందని  కలెక్టర్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#