11:15 PM, 3 Wednesday March 2021

ఉపాధి హామీ పధకం నిధుల ద్వారా నిర్మాణ పనులు

-10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి కమిటీ ఆమోదం
– కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టే నిర్మాణాలకు అవసరమైన 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశతో కలిసి జిల్లా స్ధాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎజెన్సీ ప్రాంతాలైన ఎటపాక, గుర్తేడు, పెంటకోడు, కె.కోట ప్రాంతాల్లో ఉపాధి హామీ పధకం నిధుల ద్వారా నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని, దీనికి అవసరమైన 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి కమిటీ ఆమోదించిందన్నారు. సబరి నది ధార్డ్ ఆర్డర్ స్కీమ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాజోలు దగ్గర మల్కీపురం మండలంలో 2,520 క్యూబిక్ మీటర్ల ఎత్తులో అక్రమంగా నిల్వ చేసిన బొండు ఇసుకను ప్రభుత్వ ఇళ్ళ స్ధలాలకు సిధ్ధం చేస్తున్న లేఅవుట్ల చదునుకు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రోజు వారీ వినియోగదారుల అవసరాల నిమిత్తం సుమారుగా 26 వేల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి రోజు సుమారుగా 22 వేల మెట్రిక్ టన్నుల ఇసుక బల్క్ బుకింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు, సాధారణ వినియోగదారులకు బుకింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా ఖనిజ వ్యవస్ధ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇది వరకు మంజూరు చేసిన పనుల ప్రగతిని కలెక్టర్  ఈ సందర్భంగా సమీక్షించారు. జిల్లా ఇప్పటి వరకు జిల్లా ఖనిజ వ్యవస్ధ ద్వారా రూ.31.52 కోట్లు సమకూర్చగా దీనిలో రూ.19.50కోట్లు ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఖనిజ వ్యవస్ధ ద్వారా 500 పనులు పూర్తి చేయగా, 321 పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో కొత్తగా 3.84 కోట్లతో కొత్త పనులు మంజూరుకు సిధ్ధంగా ఉన్నాయన్నారు. దీనికి అవసరమైన నిధులకు ఇసుక పై రావల్సిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) రెవెన్యూను జిల్లాకు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిడి మైన్స్ కు కలెక్టర్ సూచించారు.పురోగతిలో ఉన్న పనులను శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించి, సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రంపచోడవరం ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, డిపిఓ ఎస్.వి. నాగేశ్వర్ నాయక్, ఆర్.డబ్ల్యూ.ఎస్. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.గాయత్రీదేవి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ, నాగరాజు, ఎస్.ఎస్.ఏ. పిఓ బి విజయ్ భాస్కర్, గనులు, భూగర్భవనరుల శాఖ సహాయ సంచాలకులు డి.రంగకుమార్,జిల్లా ఇసుక అధికారి డిహెచఎస్ రవికుమార్, వ్యవసాయ శాఖ డిడి ఎస్.మాధవరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#