01:54 AM, 8 Monday March 2021

ఎటపాక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా బాణోత్.రాముడు నామినేషన్ దాఖలు

– అభ్యర్థిని బలపర్చిన నాయకులు నక్కా.నరసింహరావు
– కాంగ్రెస్ రెండో అభ్యర్థిగా భూక్య.బాల్య నామినేషన్ దాఖలు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లా పరిధిలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఎటపాక గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా బాణోత్.రాముడు శనివారం నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం కాగానే మొట్టమొదటి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు నక్కా.నరసింహరావు బలపరచగా సర్పంచ్ అభ్యర్థి బాణోత్. రాముడు ఎటపాక గ్రామసచివాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు సర్పంచ్ అభ్యర్థి బాణోత్.రాముడు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరుపున రెండవ అభ్యర్థిగా భూక్య.బాల్యా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఏదిఏమైనా మండల పరిధిలోని 5 జోన్లలో నామినేషన్లు ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎటపాక కాంగ్రెస్ మండలాధ్యక్షులు నక్కా.వెంకన్న , నాయకులు నక్కా.నరసింహరావు , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#