11:00 PM, 3 Wednesday March 2021

ఎటపాక మండలంలో నామినేషన్ల వివరాలు ఇలా…

– మొదటి రోజు సర్పంచ్ 12 , వార్డుల వారీగా 32 దాఖలు
– అధికారికంగా ప్రకటించిన మండల అధికారులు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తూ.గో జిల్లా పరిధిలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటలు వరకు 5 జోన్లలోని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్ల పత్రాల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. దీంతో సాయంత్రం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిసే సమయానికి ఎటపాక మండల పరిధిలో 12 సర్పంచులు , 32 వార్డులకు నామినేషన్ పత్రాలను అభ్యర్థులు దాఖలు చేశారు. ఎటపాక 3 , విస్సాపురం 1 , రాంగోపాలపురం 1 , పురుషోత్తపట్నం 2 , పిచుకలపాడు 4 , కృష్ణవరం పంచాయతీ 1 కలిపి మొత్తంగా 12 సర్పంచుల నామినేషన్ పత్రాలను అభ్యర్థులు దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యుల వారీగా ఎటపాక 5 , చోడవరం 4 , కృష్ణవరం 2 , లక్ష్మీపురం 2 , నెల్లిపాక 1 , పిచుకలపాడు 1 , పురుషోత్తపట్నం 15 , రాంగోపాలపురం పంచాయతీ 2 కలిపి మొత్తంగా 32 వార్డులకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అభ్యర్థులు దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఎటపాక మండల అభివృద్ధి అధికారి సి.హెచ్.విఠల్ పాల్ అధికారికంగా ధ్రువీకరించారు. అయితే రెండవ రోజైన ఆదివారం సైతం నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#