06:20 AM, 3 Wednesday March 2021

ఎటపాక వైసిపి అభ్యర్థి కాకా.వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు

వైసిపి అభ్యర్థి కాకా.వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు
– అభ్యర్థిని బలపర్చిన వైసిపి జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లా పరిధిలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఎటపాక గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి వైసిపి సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వర్లు శనివారం నామినేషన్ మొదటి నకలను దాఖలు చేశారు. వైసిపి జిల్లా కార్యదర్శి కొవ్వూరి.రాంబాబు బలపరచగా సర్పంచ్ అభ్యర్థి కాకా.వెంకటేశ్వర్లు ఎటపాక గ్రామసచివాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసిపి శ్రేణుల ఏకాభిప్రాయం మేరకు ఎటపాక పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా కాకా.వెంకటేశ్వర్లు పేరును పార్టీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు అభ్యర్థి కాకా.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కురినాల.వెంకటేశ్వర్లు (బుజ్జి) , డేగల.రామకృష్ణ , కాకా.చిట్టిబాబు , మండల నాయకులు పూనెం వీరస్వామి , ముర్రం ముత్తయ్య , సీనియర్ నాయకులు శీలం కృష్ణ , ఎటపాక యూత్ కార్యదర్శి మోతుకూరి.రాంప్రసాద్ , మండల నాయకులు బర్ల వెంకటరత్నం , మండల యూత్ నాయకులు దాసరి నరేష్ , మాచర్ల. బాబూరావు , సంతపూరి.వెంకటేశ్వర్లు , గజ్జల.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#