05:21 PM, 3 Wednesday March 2021

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి…

– పంపిణీ కేంద్రం పరిశీలన…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సహాయక ఎన్నికల అధికారి, మండపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐదం రాజు అన్నారు. మండపేట ఏడిద రోడ్డు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామాగ్రి స్టోరేజీ గదులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ చేపట్టాల్సినపనులను అధికారులకు ఆయన సూచించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ 11వ తేదీ సాయంత్రానికి బ్యాలెట్ పేపర్ మినహా సామాగ్రి మొత్తం స్కూల్ వద్దకు చేరుకుంటాయన్నారు. 12వ తేదీ మధ్యాహ్నానికి బ్యాలెట్ పేపర్లతో సంబంధిత ఎన్నికల అధికారులను ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపించడ జరుగుతుందన్నారు. మొత్తం 600 మంది అధికారులు, సిబ్బంది, మరో 200 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. వీరికి కావల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. 13వ తేదీన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#