04:08 AM, 2 Tuesday March 2021

ఎన్నికలకు సర్వం సిద్ధం…

– సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన..

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండపేట మండలం లోని 12 గ్రామాల్లో ఈ నెల 13 న పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధంచేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపీడీఓ ఐదం రాజు  పేర్కొన్నారు. మండపేట వేగుళ్ళ సూర్యరావు  ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహణ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయం తో ఎన్నికల యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మండపేట మండలం కు సంబంధించి ఈ నెల 12 వ తేదీన ఈ పంపిణీ కేంద్రం నుండి ఆయా గ్రామాలకు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్లు తదితర వాటిని సంబంధించిన ఎన్నికల స్టేజ్ అధికారులకు అందజేస్తామని తెలిపారు. రెండు జోన్ లు నాలుగు రూట్ లలో ప్రణాళికలు రూపొందించి నట్లు చెప్పారు. మొత్తం 192 పోలింగ్ స్టేషన్ లకు ఈ సామగ్రి పంపిస్తామని తెలిపారు. మొత్తం 600 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#