02:09 AM, 8 Monday March 2021

ఎన్నికల నిర్వహణ పై శిక్షణ….

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎన్నికల నిర్వహణ లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి,ఎంపీడీఓ ఐదం రాజు పేర్కొన్నారు. స్థానిక వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎన్నికల నిర్వహణ పై శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. మండలంలో పంచాయితీ ఎన్నికల్లో  పి ఓ, ఏ పి ఓ లుగా విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధి అధికారి  ఐదం రాజు  కార్యక్రమానికి హాజరై   ముఖ్యమైన సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో శిక్షకులుగా పివి రమణారావు, కె జి కృష్ణా రెడ్డి, ఎం రామలక్ష్మి, వి సూర్యలత లు వ్యవహరించారు. శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల విధులు, బాధ్యతలు వివరించారు.బ్యాలెట్ బాక్సులు నిర్వాహణ పై సూచనలు చేశారు.స్టాట్యూటరి, నాన్-స్టాట్యూటరి కవర్సు , ఛాలెంజింగ్ ఓటు, టెండరు ఓటు, ప్రోక్షి ఓటు విధానాలు,బ్యాలెట్ పేపరు అకౌంట్, అనేగ్జెర్ ఫారం, కౌంటింగ్ విధానం తదితర అంశాలు వివరించారు. అనంతరం నిర్వహించాల్సిన ఉప-సర్పంచ్ ఎన్నిక పై సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#