12:21 PM, 3 Wednesday March 2021

ఎన్నికల ప్రచారంలో నవరత్నాలతోనే…ప్రజల్లోకి

– ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రచారంలో 'మా' అస్త్రాలు
– కన్నాయిగూడెం వైకాపా సర్పంచ్ అభ్యర్థి నాగమణి

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలతోనే 17న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి ప్రచారానికి వెళ్లనున్నట్టు కన్నాయిగూడెం వైసిపి సర్పంచ్ అభ్యర్థి పెనుబల్లి.నాగమణి పేర్కొన్నారు. కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో వైసిపి తరుపున తనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేందుకు ప్రాధాన్యత ఇచ్చినందుకుగానూ తాను జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (బాబు) కు సర్పంచ్ అభ్యర్థి నాగమణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో వైసిపి తరుపున తనను నిలబెట్టినందుకు వైసిపి గ్రామశ్రేణులకు సైతం ఆమె ధన్యవాదాలు తెలిపారు. 3వ విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరణ ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలోని ఓటర్లు అందరూ తనకు ఓటు వేయాలని ఆమె అభ్యర్ధించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసును గెలుచుకున్నారని ఆమె పేర్కొన్నారు. కాబట్టి తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ముఖ్యమంత్రి బాటలోనే గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానని సర్పంచ్ అభ్యర్థి నాగమణి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కావున గ్రామప్రజలందరూ తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైసిపి సర్పంచ్ అభ్యర్థి పెనుబల్లి.నాగమణి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వైకాపా మండల అధ్యక్షులు సోడే ప్రసాద్ , వైకాపా గ్రామపంచాయతీ (ఇంచార్జి) గొల్లపల్లి శివబాబు ,తాటి ఎర్రయ్య , మాజీ సర్పంచ్ తంత్రపల్లి వెంకటేశ్వరరావు (మాజీ వైస్ సర్పంచ్) గ్రామ పెద్దలు వర్స బాలకృష్ణ , పంచాయతీ పార్టీ నాయకులు పులుసు రామకృష్ణ , వాసం.లక్ష్మి , కందుల.శ్రీను ,కాటిబోయిన నాగరాజు, చల్లా.హనుమంతు, డేగల.నరసింహ రావు(ఆటో) , చల్లా.మణి , బేతి పాపారావు, సి.హెచ్ భాస్కర్ లింగం , మొండ్రి.శివ ,బట్టా శ్రీరామూర్తి , పులుసు వంశీ , వర్స భద్రయ్య , పెనుబల్లి వెంకటేష్ , పెనుబల్లి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#