04:08 AM, 3 Wednesday March 2021

ఎన్నికల సమయం పెంచిన ఎస్ఈసి

– ఉదయం 6-30 నుండి మ.3-30 వరకు
– జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రకటనలో వెల్లడి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కోవిడ్-19 ఉనికి నేపద్యంలో పటిష్టమైన బద్రత, జాగ్రత్త లతో  నిర్వహించాల్సి ఉన్న దృష్ట్యా గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఉదయం 6-30 గం.ల నుండి మ.3-30 గం.ల వరకూ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశాన్ని ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్ధులు గమనించాలని ఆయన కోరారు. తీవ్రవాద ప్రభావిత గ్రామ  పంచాయతీలలో భద్రతా కారణాల దృష్ట్యా పోలింగ్ మద్యాహ్నం 1-30 గంలకు ముగించేందుకు ఎన్నికల కమీషన్ అనుమతి జారీ చేసిందని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#