08:35 AM, 3 Wednesday March 2021

ఏడువారాల వెంకన్న కు అందించిన వివరాలు

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఏడువారాల వెంకన్న గా ప్రసిద్ధి గాంచిన  వాడపల్లి వెంకన్న ఆలయానికి భక్తులు విరాళం అందజేశారు .శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు పద్మావతి సమేత స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ కష్టాలను కొలువుదీరే దైవంగా భావించి దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది 7 శనివారాలు  అని ఏడు ప్రదక్షిణలు చేస్తే తమ కోరుకున్న కోరికలు తీరుతాయని బావలతోఆ స్వామివారి దర్శనార్థం రావడం జరుగుతుంది.అలా వచ్చిన భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన నెక్కంటి సుధాకర్ సరస్వతీదేవి దంపతులు 50,116 రూపాయలు విరాళం ఆలయంలో అందజేశారు. అలాగే  కోట్టురి మణిశర్మ నిత్య అన్నదాన ట్రస్ట్ కు   17,014 విరాళం అందజేయగా,రావులపాలెం గ్రామానికి చెందిన పడాల చంద్రశేఖర్ రెడ్డి సత్య బాల దంపతులు10116 విరాళం ఇచ్చారు. వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు అర్చకులు ఆలయ సిబ్బంది ఆ వైకుంఠవాసుని చిత్రపటం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#