09:57 AM, 2 Tuesday March 2021

ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు గా రామ్మోహన్ ఏకగ్రీవం

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తూర్పుగోదావరి జిల్లా ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షులు గా గుద్దాటి రామమోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా పిఎస్ కెవివి మూర్తి బాబు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బూరిగ ఆశీర్వాదం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కారణంగా జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయిన సందర్భంలో అధ్యక్ష పదవికి గుద్దటి రామమోహనరావు, కార్యదర్శిగా పిఎస్ కెవివి మూర్తి బాబు ఎంపికయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శి గా పివి కృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎస్.చంద్ర రావు, సంయుక్త కార్యదర్శిగ టివి రమణ, కో-ఆప్ట్ చేసుకోవడమైనది. నూతనముగా కో – ఆప్ట్ చేసుకోబడిన జిల్లా అధ్యక్ష కార్యదర్శిల కు మరియు ఇతర కార్యవర్గ సభ్యులకు ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు ఎన్ . చంద్రశేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస రావు మరియు ఉపాధ్యకులు పసుపులేటి శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ ఉన్నతికి, సంఘ సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. సమావేశం నందు ఎ.పి.ఎన్.జి.ఒ అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ప్రేపకాయల కృష్ణ , జిల్లా ఉపాధ్యక్షులు పోలిక రాజు బాబు, ఐ భక్తవత్సలు రావు, కె నాగేశ్వరరావు, సరేళ్ళ చంద్ర రావు, ఎం.వెంకటేశ్వర రావు, జిల్లా కోశాధికారి ఈరంకి నారాయణ, సంయుక్త కార్యదర్శిలు డేవిడ్ ఎలియాబర్, తిరగటి వెంకట రమణ, కెవిఎన్ వి ప్రసాద్, మహిళా సంయుక్త కార్యదర్శి డి శ్రీదేవి, కార్య వర్గ సభ్యులు ఎం అనురాధ, బి శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#