– రూరల్ ఎస్ ఐ ఆధ్వర్యంలో అవగాహన…
మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే గీటురాయి అని మండపేట రూరల్ ఎస్ ఐ పీతల దొరరాజు పేర్కొన్నారు. మండపేట మండలం ఏడిద పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా ఓటర్లు చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. అవగాహనా తో ప్రశాంత ఎన్నికలకు పోలీసులకు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ సెక్రటరీ ఉండమట్ల వీర్రాజు మాట్లాడుతూ ఓటు హక్కు ను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఎటువంటి సమస్య వచ్చిన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు, పోలిస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.