అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల గడువును అపరాధ రుసుంతో ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ జనార్ధన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఇందులో పదో తరగతికి రూ. 200, ఇంటర్మీడియెట్ కు రూ. 200 అపరాధ రుసుం చెల్లించి అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. దీన్ని చివరి అవకాశంగా భావించి సద్విని యోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా పాఠశాల పనివేళల్లో జిల్లా పరిషత్ అంబాజీపేట హై స్కూల్ నందు వ్యక్తిగతంగా కానీ లేదా చరవాణి ద్వారా గాని ( 9912703454 ) సంప్రదించాలని తెలిపారు.