గుత్తి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధి లోని గుత్తి ఆర్ యస్ తోళ్ల షాప్ వద్ద ఆదివారం పెయింటర్ అశోక్ మర్డర్ మిస్టరీ వీడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మృతుడి భార్యనే తన ప్రియుడి తో హత్య చేయించింది. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సీఐ రాము విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమం లో యస్ ఐ లు గోపాలుడు , బాషా , కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.