10:07 AM, 16 Saturday January 2021

కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తత

– సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తతతో వుండవలసిన ఆవశ్యకత వుందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.  సోమవారం జె.సి.క్యాంపు కార్యాలయంలో  కోవిడ్-19 నియంత్రణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూకరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా 50 రోజుల కేంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు.   డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవరి  19 తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ కార్యక్రమాన్ని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారుసానిటైజరు వుపయోగించాలనిసామాజిక దూరం పాటించాలనిమాస్కులు తప్పని సరిగా ధరించాలని ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు తెలియ చేయాలన్నారు.  పండుగ సందర్భంగా మరింత అప్రమత్తతతో వుండాలని వారికి తెలిపాలన్నారుప్రజా ప్రతినిధులుప్రభుత్వ యంత్రాంగంపోలీస్వైద్య సిబ్బందివాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించడం వలన మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.  ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారుస్వయంశక్తి సంఘాలుఉపాధిహామీ సిబ్బందిఆర్.టి.సిఎండోమెంట్స్,  ఎం.డి..లుసెక్రటరీలుమున్సిపల్ కమీషనర్లు కార్యక్రమంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారుగ్రామ స్థాయిలోనుమండల స్థాయిలోను కాంపెయన్ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని తెలిపారు.  సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించి ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు.

 సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్యజిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిజిల్లా పరిషత్ డిప్యూటీ సి..లక్ష్మీపతిప్రజా రవాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎంజి.వరలక్ష్మితదితర అధికారులు హాజరైనారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#