04:20 AM, 3 Wednesday March 2021

కలెక్టరేట్ లో జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి

కాకినాడ సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జాతిపిత మహాత్మా గాంధీజీ 73వ వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టర్ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు
జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి రాజకుమారి, డీఆర్వో సిహెచ్ సత్తిబాబు లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం కోర్టు హాలులో కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మౌనం పాటించారు. జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి నేటితో పదవీ విరమణ పొందుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పాలూరి శ్రీరామచంద్రమూర్తి ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ వో పీ ప్రసాద్ రావు, కలెక్టరెట్ ఏఓ జీఎస్ ఎస్ శ్రీనివాసు, కలెక్టరెట్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#