11:45 PM, 3 Wednesday March 2021

కాకినాడలో పార్కులు అన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు

– రాజా ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ సమావేశంలో
– నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడి

కాకినాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కాకినాడ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరంలోగల పార్కులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కాకినాడ రాజా ట్యాంక్ పార్కు ఆవరణంలో స్ధానిక నాయకులు సుంకర విద్యాసాగర్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ముందుగా రాజా ట్యాంకు పార్కును కమిషనర్ పరిశీలించారు. పార్కులో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ. 50 లక్షలతో పార్కు అభివృద్ధి చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ పార్కు నుండి కార్పొరేషన్ కు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. రాజా ట్యాంక్ పార్క్ అభివృద్ధికి, ప్రజలకు మరింత ఆహ్లాదం పంచే విధంగా మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నగరంలో ఉన్న అన్ని పార్కులకు సంబంధించిన వాకర్స్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎస్ఈ సత్యనారాయణరాజు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రమణరావు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#