– ఎంహెచ్ఓ డాక్టర్ పృద్వి చరణ్
కాకినాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని యంహెచ్ ఓ డా.పృద్వి చరణ్ తెలిపారు. ఆదివారం కాకినాడ కొర్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెంపుడు కుక్కలు, పందులకు లైసెన్సు తప్పక తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వీధి కుక్కలపై వస్తున్న ఫిర్యాదులు మేరకు కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం వాటికి ఏబిసి ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో వీధి కుక్కలు అధికంగా పెరిగిపోయినందున అదనంగా మరో రెండు ఏబిసి సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా కాకినాడ నగరంలో ఏబిసి సెంటర్లు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు.