09:15 PM, 1 Monday March 2021

కార్మిక వ్యతిరేక విధానాలు వద్దు…

– వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి..

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నెల్లి మర్ల అమరవీరుల పోరాట స్పూర్తి ని కార్మిక వర్గం అందిపుచ్చుకోవాలని ఐ ఎఫ్ టి యు చీకట్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట ఏడిద రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో శుక్రవారం నెల్లిమర్ల అమరవీరుల 27 వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని విజ్ఞప్తి చేసారు.వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరారు. రైతులు పోరాటాలు ఎదుర్కోలేక బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. తొలుత అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు జట్టు యూనియన్ నాయకులు కొప్పిరెడ్డి రాంబాబు,నుక పెయ్యి రాజేష్, చల్ల శ్రీను,గోనిశెట్టి నాగేశ్వరరావు, కాలా సుబ్రహ్మణ్యం, వానరాసి  రాంబాబు,ప్రగతి శిలా యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వి చిట్టి బాబు, గుబ్బల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#