09:51 AM, 15 Friday January 2021

కూతురుకి ప్రేమతో సెల్యూట్….

– పోలీసు నాన్న పోలీసు కూతురు….

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పోలీసు డిపార్ట్‌మెంట్ లో తన ఉన్నతాధికారి కి సెల్యూట్ చెయ్యడం మామూలు విషయమే., కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ – గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి “ఇగ్నైట్” వేదికయ్యింది.

2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగం లో జెస్సీ ప్రశాంతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు తిరుపతి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సీఐగా శ్యామ్ సుందర్ పని చేస్తున్నారు.

తిరుపతి లో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురిని చూస్తూ శ్యామ్ మురిసిపోయారు. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండడం దూరం నుంచి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు, తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా…అంటూ గట్టిగా నవ్వేశారు…పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు. నా బిడ్డ నీతి నిజాయతీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని శ్యామ్ సుందర్ అన్నారు. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పందిస్తూ “ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటాం. తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యడం నాకు వ్యక్తిగతం గా చాలా గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంతి” అని అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#