– మధ్యాహ్న భోజన పథకం అమలు విషయమై సంతృప్తిని వ్యక్తం చేసిన
– తహసీల్దార్ ఎవియల్ నారాయణమూర్తి
కూనవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం కూనవరం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలని మండల తాసిల్దార్ నారాయణ మూర్తి శనివారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి భోజన పథకం గురించి వారపు మెను గురించి సక్రమంగా పరిశుభ్రంగా పెడుతున్నారా లేదాని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు విద్యాపరంగా కానీ పాఠశాలలో ఏమైనా సమస్యలు తలెత్తినా తమ కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు విషయమై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు