04:01 AM, 3 Wednesday March 2021

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి… ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జగ్గంపేట(విశ్వం వాయిస్ న్యూస్ ):బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా బుధవారం నాడు జగ్గంపేట మండలం భావారం గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని విధంగా 3 కార్పొరేట్ సాగు చట్టాల రద్దు విద్యుత్ సంస్కరణల చట్టం 2020 ఎత్తివేత పంటల కనీస గిట్టుబాటు ధర లకు చట్టబద్ధత అంటూ ఢిల్లీలో నిత్యం నిర్బంధాన్ని ఎదుర్కొంటూ నెలల తరబడి భారత రైతాంగం పోరాడుతుంది కానీ నిన్నటిదాకా కరోనా తో లాక్ డౌన్ విధించబడింది దేశమే అతలాకుతలమై ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు ప్రజలకు తిండి సమకూర్చి పెట్టాయి అలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న బిజెపి తన ఎన్నికల వాగ్దానానికి తిలోదకా లీచ్చింది అని తెలిపారు రైతులు చేస్తున్న ఆందోళన లపై దృష్ట ప్రసారాలను అక్రమ కేసులను ఎర్రకోట వద్ద జరిగిన హైడ్రామా ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడుతున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సింగరయ్య తమ్మారావు కూడా రాజులు లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#