– ప్రచారం పాల్గొన్న లీలా కృష్ణ…
మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట మండలం కేశవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున సీనియర్ నాయకుడు ఉండమట్ల రామారావు సర్పంచ్ పదవికి పోటీపడనున్నారు.ఈ మేరకు శనివారం జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం ఆరంభించారు. తొలుత ప్రసిద్ధి చెందిన గని పోతురాజు ఆలయం లో పూజలు నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి ఉండమట్ల రామారావు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తనను ఆశీర్వదించాలని రామారావు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ జన సేన నేత రామారావు గెలుపు ఖాయమని పేర్కొన్నారు. కేశవరం జన సేన కు బలం ఉన్న గ్రామమని పేర్కొన్నారు. జన సైనికులు శక్తి వంచన లేకుండా ఎన్నికల్లో జన సేన అభ్యర్థి గెలుపు కు కృషి చేయాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో ని అన్ని గ్రామ సర్పంచ్ పదవులకు జన సేన అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. తాపేశ్వరం సర్పంచ్ పదవికి మిత్ర పక్షం బీజేపీ పోటి చేస్తుందని తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ, జన సేన కూటమి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.