10:23 AM, 16 Saturday January 2021

కోడి పందాలకు అనుమతుల్లేవు

ఆలమూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని మండపేట రూరల్ సిఐ కె మంగాదేవి ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ శివప్రసాద్ ఆలమూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన  సమావేశంలో తెలిపారు. కోడి పందాలు, గుండాట, రికార్డింగ్ డాన్సులు, జూదాలు, అసాంఘిక కార్యక్రలాపాలకు
పాల్పడినా, కోళ్ళకు కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని,
పక్షులను గాని, జంతువులను గాని హింసించుట చట్టరీత్యా నేరమని అతిక్రమిస్తే చట్టరీత్యా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండపేట సర్కిల్ పోలిస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో
ఎక్కడైనా కోడి పందాల బరులు సిద్ధం చేస్తే సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉండటంతో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించి ఇంటి వద్దే సంక్రాంతి పండుగను  జరుపుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#