04:28 PM, 28 Thursday January 2021

కోడి పందాలు – జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు

కోడి పందాలు – జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు.
– ఎటపాక సీఐ గీతా రామకృష్ణ వెల్లడి

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో ఎటువంటి కోడిపందాలు , జూదాలు నిర్వహించరాదని , కాదని ఎవరైనా నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎటపాక సీఐ గీతారామకృష్ణ హెచ్చరించారు. సీఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందాలను నిర్వహిస్తే స్థానికులు సహకరించి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. కోడిపందెం, జూదం , గుండాట వంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి గరిష్టంగా ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రెండువేల వరకు జరిమానా పడుతుందని తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండకూడదన్నారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. కుటుంబాలను కాదని అసాంఘిక కార్యకలాపాలకు వెళితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కోడి పందేలు, అశ్లీలనృత్యాలు, జూదం ,గుండాట వంటి వాటి జోలికి పోవద్దని పేర్కొన్నారు. ఈ పందాలకు తమ వ్యవసాయ పొలాలు ఇవ్వొద్దని రైతులకు సూచించారు. క్రికెట్ బెట్టింగ్, కోడిపందాలు వంటి వాటి జోలికి పోయి కేసుల్లో ఇరుక్కోవద్దని , జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#