04:54 PM, 28 Thursday January 2021

కోడి పందాలు నిర్వహిస్తే… రౌడి షిట్ ఓపెన్ చేస్తాం… రాయవరం ఎస్సై పి. వి. యస్. యస్. ఎన్. సురేష్..

మండలంలో కోడి పందాలు నిర్వహిస్తే వారిపై రౌడి షిట్ పెడతామని రాయవరం ఎస్సై పి. వి. యస్. యస్. ఎన్. సురేష్ హెచ్చరించారు.సోమవారం అయన
మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోఎస్సై సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండగను సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాయవరసంవిశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలో కోడి పందాలు నిర్వహిస్తే వారిపై రౌడి షిట్ పెడతామని రాయవరం ఎస్సై పి. వి. యస్. యస్. ఎన్. సురేష్ హెచ్చరించారు. సోమవారం అయన
మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోఎస్సై సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండగను సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామంలో పోలీస్‌ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కోడి పందాల బరులు ఏర్పాటు నిమిత్తం ఎవరైనా భూములిచ్చిన సంబంధిత యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల దష్ట్యా ఈ కోడిపందాలతో పాటు ఇతర చట్టవ్యతిరేక జూధాలను నిషేధించడం జరిగిందని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే 33మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, కోడి పందాలు జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరికలు జారీ చేశామని, ఆయా ప్రదేశాలలో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, మసీదులు చర్చిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నదని, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలియజేశారు. మిగతా దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దేవాలయాలు మరియు మసీదులు,చర్చిలు పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అలాగే ప్రత్యేకంగా మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#