– రాయవరం ఎం పి డి వో మల్లాపు రెడ్డి శ్రీను
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కోవిడ్-19 టీకా పూర్తిగా సురక్షితమైందని.. ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని రాయవరం ఎం పి డి వో మల్లాపు రెడ్డి శ్రీను పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వద్ద పి హెచ్ సి వైధ్యాదికారిణి అంగర దేవి రాజశ్రీ అద్వర్యంలో కోవిడ్ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో రెండో దశ టీకా కార్యక్రామానికి రాయవరం ఎం పి డి వో మల్లాపు రెడ్డి శ్రీను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎం పి డి వో మాట్లాడుతూ రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామ వలంటిర్లు తదితర శాఖల ఫ్రంట్లైన్ సిబ్బందికి టీకా పంపిణీ కార్యక్రమం జరిగిందని, తొలి డోసు వేసుకున్నాక మళ్లీ 28వ రోజున రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుందని, దీనికి 14 రోజుల తర్వాత ఇమ్యూనిటీ వస్తుందని వివరించారు. టీకా గురించి అనవసర భయాందోళనలు వీడి.. ఆరోగ్యకర సమాజానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు. మండల పరిధిలో వున్నా ఆరోగ్య శాఖ ఉద్యోగులు తదితరులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వివరించారు. ఎవరికైనా జ్వరం, చిన్నపాటి దద్దుర్లు వంటివి వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనవసర భయాన్ని వీడి టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం ఎం పి డి వో కోవిడ్ టీకా వేయించుకున్న వారితో నేరుగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ సి వైధ్యాదికారిణి సి హెచ్ రమ్యశ్రీ, హెచ్ ఈ సి యు సీతామాలక్ష్మి, హెచ్ వి విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ మెయిల్ కే వెంకటేశ్వరరావు, ఎ ఎన్ ఎం లు కే అనురాధ, ఎం బుజ్జి, మహిళా పోలీస్ కార్యదర్శి సత్యవతి, డేటా ఎంట్రి ఆపరేటర్ రమ్య తదితరలు ఉన్నారు.