జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఈ వ్యాక్సిన్ పై ఎవరికీ ఎటువంటి అపోహలు వద్దని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మత్తు వైద్యనిపుణులు కె సత్యనారాయణ (ఎండి )అన్నారు.ఈ వ్యాక్సిన్ జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో శుక్రవారం నాటికి 323 వ్యాక్సిన్లు వేశామన్నారు. అలాగే జగ్గంపేట మండలం రాజపూడి హెల్త్ సెంటర్ లో 98 వ్యాక్సిన్ వేయడం జరిగింది అన్నారు .ప్రస్తుతం జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 150 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు .ఈ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచు కోవాలని డాక్టర్ సత్యనారాయణ అన్నారు.